Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంట్రాక్టర్లను బెందిరించిన వైఎస్ కొండారెడ్డి జిల్లా బహిష్కరణ

appolice
, గురువారం, 12 మే 2022 (07:38 IST)
ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్లను బెదిరించిన కేసులో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై విడుదలైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వైఎస్. కొండారెడ్డి జిల్లా బహిష్కరణ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టరుకు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
చక్రాయపేట మండలం నాలుగులేన్ల రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న ఎస్.ఆర్.కె కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగులను బెందిరించడమే కాకుండా, రూ.5 కోట్ల డబ్బులు డిమాండ్ చేసినందుకు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
అయితే, ఆయనపై ఈ తరహా కేసులు అనేకం ఉండటంతో ఆయన్ను జిల్లా నుంచి బహిష్కరించేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా వెంటనే అవినీతి నిరోధక శాఖ ఫోన్ 14400 లేదా 100 లేదా తన ఫోన్ నంబరు 94407 96900కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవిష్యత్ బెంగతో పెళ్లి కొడుకు ఆత్మహత్య .. ఎక్కడ?