Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీల్ ప్లాంట్‌తో జిల్లా రూపు రేఖలు మారిపోతాయ్ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:02 IST)
కడప జిల్లా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ జిల్లా ప్రజల చిరాకల స్వప్నం నెరవేర్చేందుకు ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేసినట్టు చెప్పారు. 
 
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని, యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలని తన తండ్రి దివంగత వైఎస్ఆర్ కలలుకన్నారన్నారు. ఆయన మరణాంతరం ఈ ప్రాంతాన్ని ఏ ఒక్క పాలకుడూ పట్టించుకోలేదన్నారు. ఇపుడు వైఎస్ఆర్ బిడ్డగా మీ బిడ్డ అయిన తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంతానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. 
 
వైఎస్ఆర్ కలలను సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురునిలిచి, ఇపుడు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. వచ్చే 24 లేదా 30 నెలల్లో ఈ ప్లాంట్ తొలి నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్లాంట్ మొదలైన అనుబంధ పరిశ్రమలు జిల్లాకు తరలివస్తాయని, జిల్లా అభివృద్దిలో ఇకపై దూసుకుని పోతుందన్నారు. ప్రారంభంలో ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం 3 మిలియన్ టన్నులుగా ఉందని, భవిష్యత్‌లో ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని సీఎం జగన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments