Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారబోతుంది...

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (08:43 IST)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరునామా మారబోతుంది. గత ఐదేళ్లుగా ఆయన కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథి గృహంలో ఉంటున్నారు. అమరావతి నిర్మాణ కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటాని పలుమార్లు చెప్పిన చంద్రబాబు.. ఇటీవల రాజధాని ప్రాంతంలో ఇంటిస్థలం కొనుగోలు చేశారు. వివిధ ప్రాంతాల్లో అన్వేషించిన అనంతరం వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఆ స్థలాన్ని ఎంపిక చేశారు. 
 
25 వేల చదరపు గజాల ఈ ప్లాట్ ఈ-6 రోడ్డుకు ఆనుకుని వుంది. ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ఫ్లాట్. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్టు తెలిసింది. ఈ ఫ్లాట్‌కు నాలుగు వైపులా రోడ్డు వుంది. రాజధానిలో కీలకకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్కనే వెళుతుంది. గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ తదితర కీలక భవనాలు ఈ ఫ్లాట్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఫ్లాట్‌లో కొంత విస్తీర్ణంలోనే ఇంటిని నిర్మించి, మిగిలిన స్థలాన్న ఉద్యానం, రక్షణ సిబ్బందికి గదులు వాహనాల పార్కింగ్ తదితరాలకు వినియోగించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫ్లాట్‌లో వివిధ చోట్ల మట్టి పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ఖాతాలో అడ్వాన్స్ బుకింగ్‌లతో కొత్త రికార్డ్

చిరంజీవి లేటెస్ట్ ఫొటో షూట్ - నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెలతో చిత్రం

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments