Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 February 2025
webdunia

జగన్ చంపాలనుకున్న వ్యక్తి ఇపుడు డిప్యూటీ స్పీకర్.. సీఎం చంద్రబాబు

Advertiesment
chandrababu naidu

ఠాగూర్

, గురువారం, 14 నవంబరు 2024 (17:35 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అధికార మదమెక్కి చంపాలనుకున్న మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇపుడు డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చొన్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఏపీ శాసనసభ ఉప సభాపతిగా రఘరామకృష్ణంరాజు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయనను చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు స్వయంగా తీసుకెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 
 
ఆ తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో వైకాపా నేతలు మాకు ప్రతిపక్ష హోదాలేకుండా చేస్తామన్నారని ప్రగల్భాలు పలికారన్నారు. కానీ, ప్రజలే వారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్నారు. ప్రతిపక్షహోదా నాయకులు ఇచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలన్నారు ప్రజాస్వామ్యంలో హోదాలను ఎవరూ శాసించలేరన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
పైగా, గత వైకాపా ప్రభుత్వంలో రఘురామకృష్ణంరాజును రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చేశారనీ, ఇపుడు వారంతా అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది తాము రాసిన స్క్రిప్టు కాదని దేవుడు రాసిన స్క్రిప్టు అని గుర్తు చేశారు. గత ఐదేళ్ల కాలంలో అసెంబ్లీని కౌరవసభగా మార్చారనీ, గౌరవసభ అయ్యాకే వస్తానని ఆనాడు శపథం చేసి సభను వెళ్లిపోయానని తెలిపారు. 
 
అంతేకాకుండా, అధికార మదంతో నాటి సీఎం జగన్ అవమానించిన వ్యక్తి ఇపుడు స్పీకర్ అయ్యారని, జగన్ చంపాలని చూసిన రఘురామ కృష్ణంరాజు ఇపుడు ఉప సభాపతి అయ్యారన్నారు. రఘురామను అరెస్టు చేసే రోజు ఆయన పుట్టిన రోజు కూడా అని, ఆరోజున ఆయనను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందారన్నారు. 
 
ఒక ఎంపీని అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం దేశంలో సంచలనం సృష్టించిందని వివరించారు. హార్ట్ సర్జరీ చేసిన వ్యక్తిని ఆ విధంగా టార్చర్ చేయడం గతంలో జరగలేదన్నారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను... ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు, వినలేదు... బహుశా ఇదే మొదటిది, చివరిది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను ప్రేమిస్తావా లేదా?: ఇనుప రాడ్డుతో యువతిపై ప్రేమోన్మాది దాడి