Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

cmbabu

ఠాగూర్

, శనివారం, 30 నవంబరు 2024 (08:56 IST)
రాష్ట్రంలోని జైళ్లలో ఏం జరుగుతుందని, వివిధ కేసుల్లో అరెస్టయి జైళ్లకు వచ్చే వైకాపా నేతలకు రాచమర్యాదలు ఎలా సమకూరుతున్నాయని జైళ్ల శాఖ అధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా.. ఉన్నతాధికారులైన మీరంతా ఏం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ శాఖ పరిధిలో జైళ్లలో ఏం జరుగుతోందో తెలుసుకొనే కనీస బాధ్యత కూడా మీకు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. అవినీతితో రాష్ట్రాన్ని దోచుకొన్నవాళ్లు అందులో నాలుగు రూపాయలు విసిరేస్తే జైళ్లలో ఏం కావాలంటే అది జరిగిపోతుందా? మీపై నమ్మకంతో బాధ్యత అప్పగిస్తే ఇలాగేనా చేసేది? అంటూ జైళ్ల శాఖ ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అవినీతి కేసులో అరె స్టయిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి విజయ వాడ జైల్లో రిమాండ్లో ఉన్న సమయంలో అధికారులు రాజభోగాలు సమకూర్చారని 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన వార్తను చూసిన ఆయన ఆ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. 
 
చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో తన సోదరుడి దశ దిన కర్మక్రియలకు హాజరైన చంద్రబాబు.. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. పత్రికలో వార్తను చూసిన ఆయన దీనిపై తనకు తక్షణమే నివేదిక ఇవ్వాలని, అలాగే జైళ్ల శాఖ డీజీ విశ్వజిత్, నిఘా విభాగం అధిపతి లడ్డాను. పిలిపించి మరీ చీవాట్లు పెడుతూ ఆదేశించారు. వారిద్దరూ కలిసే సమయానికే సీఎంకు ప్రాథమిక నివేదిక అందింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయన గదిలో కొత్త టీవీ, కొత్త ప్రిజ్ ఏర్పాటు చేశారని, జైలు కోసం దాతలు ఇచ్చిన వాటిని అధికారులు వెంకటరెడ్డి గదిలో పెట్టారని ఆ నివేదికలో పేర్కొన్నారు. 
 
అలాగే కోర్టు అనుమతి లేకపోయినా బయటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి జైలు అధికారులు అనుమతించారని తెలిపింది. బయటి నుంచి వెంకటరెడ్డి భోజనం తెప్పించుకోవడానికి కోర్టు అనుమతి ఉందా? అని సీఎం ప్రశ్నించడంతో లేదని విశ్వజిత్ అంగీకరించారు. ఎవరి ప్రమేయంతో ఈ వ్యవహారం జరిగిందో తనకు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. 
 
కాగా, జగన్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సమయంలో అక్కడ పని చేసిన ఒక అధికారి ప్రస్తుతం విజయవాడ జైల్లో ముఖ్య బాధ్యతల్లో ఉన్నారని, వైసీపీ నేతలతో ఆయనకున్న సాన్నిహిత్యం వెంకటరెడ్డికి ఉపయోగపడిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఆగ్రహం నేపథ్యంలో ఆ శాఖలో ఒక రిద్దరిపై వేటు పడే సూచనలున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్