Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు... తుగ్ల‌క్!

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (15:07 IST)
అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని, ఇతర రాష్ట్రాల్లోకన్నా ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.

 
 జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని, అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పుడు ఏం చేప్పారు...ఇప్పుడు జగన్‌ ఏం చేస్తున్నారని నిలదీశారు. జగన్‌ది తుగ్లక్‌ పాలన కాక మరేమిటన్నారు. అధికారం ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని, పెట్రోల్‌ ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

 
పెట్రో ధరలతో రైతులు అప్పులపాలవుతున్నారని, ఓ పక్క విధ్వంసం.. మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్‌ పాలన అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
కర్నాటక పెట్రోల్ పై రూ.7లు, డీజిల్ పై రూ.7 తగ్గించింది. తమిళనాడు పెట్రోల్, డీజిల్ పై రూ.3లు తగ్గించింది. అస్సాం, గోవా త్రిపురు, గుజరాత్, మణిపూర్ మిజోరం, సిక్కిం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ రూ.7 తగ్గించాయి. హర్యానా పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.12 తగ్గించింది. మధ్యప్రదేశ్ పెట్రోల్, డీజిల్ పై 4 శాతం వ్యాట్ తగ్గించింది. హిమాచల్ ప్రదేశ్ పెట్రోల్ రూ.12, డీజిల్ రూ.17లు, అరుణాచల్ ప్రదేశ్ పెట్రోల్, డీజిల్ పై 5.5శాతం వ్యాట్ తగ్గించింది. ఢిల్లీ పెట్రోల్ పై రూ.6.07లు, డీజిల్ పై రూ.11.75 పైసలు తగ్గించారు. రాజస్థాన్ వ్యాట్ తగ్గించింది. కోవిడ్ వల్ల ఇబ్బందులు పడ్డవారి కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాయి. మీరెందుకు చేయరు జగన్మోహన్ రెడ్డి అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments