Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాక

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (12:55 IST)
ఇపుడు అంద‌రి ఫోక‌స్ తిరుప‌తిపైనే... కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం తిరుపతికి రానున్నారు. సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి నేరుగా తాజ్‌ హోటల్‌కు వెళ్తారు. రాత్రి అక్కడ బస చేస్తారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ లో బయల్దేరి, నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు.


అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుంటారు. 
 
 
అదే హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్‌ హోటల్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40కు దిల్లీ చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments