Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
, మంగళవారం, 9 నవంబరు 2021 (08:19 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిచిపోయిన 12 ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. అదేసమయంలో ఈ పునరుద్ధరించిన రైళ్ళను అన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్‌లుగా నడుస్తాయని పేర్కొంది. ఫలితంగా టికెట్ చార్జీలు పెరగడంతోపాటు అవి ఆగే స్టేషన్ల సంఖ్య కూడా పరిమితం కానుంది. ఇది నిజంగానే చేదువార్త. 
 
దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన ప్యాసింజర్ రైళ్లు ఇవే..
* తెనాలి-రేపల్లె-తెనాలి (07873/07874), రేపల్లె-తెనాలి-రేపల్లె (07875/07876). ఇది ఈ నెల 13 నుంచి అందుబాటులోకి వస్తుంది.
* మిర్యాలగూడ-నడికుడి-మిర్యాలగూడ (07277/07273). ఈ మెమూ రైలు ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది.
 
*నర్సాపూర్-విజయవాడ-నర్సాపూర్ (07044/07045). ఈ డెమూ రైలు 14 నుంచి పట్టాలపైకి వస్తుంది.
* కాచిగూడ-రొటెగాం-కాచిగూడ (07571/07572) ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వస్తుంది.
* కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ (07276/07974). ఇది ఈ నెల 11 నుంచి సేవలు ప్రారంభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీడియానా, అయ్య బాబోయ్.. వద్దు వెళ్ళిపోండంటూ రేవంత్ రెడ్డి, ఎందుకు?