Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ వేళ ప్రత్యేక రైళ్లు

Advertiesment
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ వేళ ప్రత్యేక రైళ్లు
, గురువారం, 7 అక్టోబరు 2021 (21:25 IST)
దసరా పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. దసరా సెలవులకు అనేక మంది తమతమ సొంతూళ్ళకు వెళ్లేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లను నడుపనుంది. అదేసమయంలో దసరా పండుగ సీజన్‌లో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని వీటిని నడుపనుంది. 
 
అంతేకాకుండా, ఈ దఫా పాసింజర్స్‌కు ఇబ్బందులు కలగకుండా ఇటు ఆర్టీసీ, అటు రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్పెషల్ బస్సులు, ట్రైన్స్ అదనంగా నడుపుతున్నారు. ఈ క్రమంలోనే పండుగ రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక సర్వీసులు నడపబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైలు సర్వీసులకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
 
ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 
* రైలు నంబరు 07456 సికింద్రాబాద్ నుంచి నర్సాపురం. 14వ తేదీ రాత్రి 10 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపురం చేరుతుంది.
 
* రైలు నంబరు 07455 నర్సాపురం నుంచి సికింద్రాబాద్. ఈ రైలు 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు నర్సాపురం నుంచి బయలుదేరి, 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతోంది.
 
* రైలు నంబరు 07053 సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్. 14వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, 15వ తేదీ ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్ చేరుతోంది.
 
* రైలు నంబరు 07054  కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్. 17వ తేదీ రాత్రి 8 గంటల 45 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం.. దంచి కొడుతున్న వర్షాలు