Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమిత్ షాకు ర‌ఘురామ‌ పిర్యాదు...హోంమంత్రి భర్తకు జ‌బ‌ల్పూర్ బదిలీ!

అమిత్ షాకు ర‌ఘురామ‌ పిర్యాదు...హోంమంత్రి భర్తకు జ‌బ‌ల్పూర్ బదిలీ!
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (14:45 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అస‌లు త‌గ్గ‌డం లేదు. ఏపీలో తమ ప్రభుత్వంలో జరిగే ఏ ప్రజావ్యతిరేకత, చట్ట వ్యతిరేక పనులను చూస్తూ ఊరుకోవటం లేదు. ఆయన స్థాయిలో ఆయన పోరాటం చేస్తున్నారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వంతో పోరాడి, విజయం సాధిస్తున్నారు కూడా. తాజాగా ఆయన వారం రోజులు క్రిందట చేసిన ఒక ఫిర్యాదు విషయంలో కూడా విజయం సాధించారు. అలాగే ఒక బీజేపీ ఎంపీ కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ కు షాక్ ఇచ్చారు రఘురామకృష్ణం రాజు. 
 
 
హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటులో ఒక ఉన్నతాధికారి. ఆయన గతంలో ముంబై, హైదరాబాద్ ఇలా ఇతర రాష్ట్రాల్లో పని చేసారు. అయితే ఎవరి లాబీయింగ్ చేసారో కానీ, పది రోజుల క్రితం ఆయన్ను విజయవాడలోని ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటుకు ట్రాన్స్ఫర్ చేసారు. ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు అంటే తెలిసిందేగా. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఎలా టార్గెట్ చేస్తున్నారో చూస్తున్నాం. ఈ క్రమంలో ఏకంగా ఒక రాష్ట్ర హోంమంత్రిగా తన భార్య ఉన్నా కూడా, భర్తని అదే రాష్ట్రంలో వేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు ఆయన బాధ్యతలు స్వీకరించే రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకటం పై విమర్శలు వచ్చాయి.
 
 
దీంతో వీటి పై బీజేపీకి చెందిన ఒక ఎంపీతో పాటుగా, రఘురామరాజు నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. ఐటి కమీషనర్ గా హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ని విజయవాడలో నియమించటం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకం అని తెలిపారు. అంతే కాకుండా, ఆయన బాధ్యతలు తీసుకునే సమయంలో, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు కూడా జత పరిచారు. 
 
 
ఏమైందో ఏమో కానీ, నిన్న హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎంత వేగంతో విజయవాడ వచ్చారో, అంతే వేగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ వెళ్ళిపోయారు. దీని వెనుక ప్రధానంగా అమిత్ షా కు ఇచ్చిన ఫిర్యాదే కారణం అని తెలుస్తుంది. అంటే లాబీయింగ్ చేసిన వైసీపీ ఎంపీల కంటే, రఘురామరాజు, ఫిర్యాదు చేసిన మరో బీజేపీ ఎంపీ పవర్, కేంద్రం దగ్గర గట్టిగా పని చేసిందని అర్ధం అవుతుంది. మరి బదిలీ వెనుక అసలు కారణం ఏమిటో మాత్రం అధికారికంగా చెప్పలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కొంటున్న‌ ఏపీఎస్‌ఆర్టీసీ...నెల్లూరు, కడప, మదనపల్లి