Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి ఈ నెల 13న రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (15:56 IST)
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు తిరపతిలో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 13న తిరుపతికి అమిత్‌షా రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 15న శ్రీవారి దర్శనం అనంతరం అమిత్‌షా తిరుగు ప్రయాణమవుతారు.
 
 
తిరుప‌తిలో ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో హోం మంత్రి అమిత్ షా స‌మావేశం కానున్నారు. దీనితోపాటు ఏపీ సీఎం కూడా ఈ స‌మావేశంలో పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను, ఆర్ధిక‌మైన ఇబ్బందుల‌ను హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌రిపి, ఒక నోట్ త‌యారు చేసి అందించాల‌ని చూస్తున్నారు. కొత్త‌గా ఏర్ప‌డిన ఏపీకి లోటు బ‌డ్జెట్ పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇందుకు కేంద్రం స‌హ‌క‌రించాల‌ని కోర‌నున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments