Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే ఫ్లవర్ పూసింది.. చాలా అరుదైన పుష్పం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 మే 2019 (20:13 IST)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్న గార్డెన్‌లో అరుదైన 'మే ఫ్లవర్' మొక్క కనిపించింది. అందమైన పూలతో వికసించిన ఈ మే ఫ్లవర్‌ సందర్శకులకు, ఉద్యోగులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. భూమి లోపల ఉన్న గడ్డ మొక్కగా పెరిగి పూలతో వికసించింది. 
 
మే 1వ తేదీ నుంచి మొక్కగా పెరుగుతూ 15న పూలతో వికసించినట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. మరో 15 రోజులపాటు అందమైన పుష్పాలతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచి 30వ తేదీ అనంతరం చెట్టు చనిపోతుందని, సంవత్సరమంతా ఆ మొక్క ఇక కనిపించదు అని తెలిపారు. 
 
భూమిలో ఉన్న వేర్లగడ్డ తిరిగి మే నెలలోనే మొక్కగా పెరిగి పూలతో వికసిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పూల మొక్కలు చాలా అరుదుగా ఉంటాయని వర్సిటీ ఉద్యోగులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments