జగన్‌ను కూడా ఇలా అరెస్ట్ చేయలేదు.. ఖండించిన బీజేపీ

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (10:15 IST)
CBN
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరమని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, విచారణ చేయకుండా, నోటీసులు లేకుండా ఒక విపక్ష నాయకుడ్ని అరెస్ట్ చేయడం కేవలం కక్ష సాధింపు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. 
 
గతంలో జగన్‌ను అరెస్ట్ చేసే ముందు ఆయనను అనేక పర్యాయాలు విచారించి, నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేశారని సీఎం రమేశ్ గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని... సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు.
 
మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు. ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments