తెలంగాణా మంత్రి కేటీయార్ కు ఇది సిగ్గుచేటు...హీరోలకు యాక్సిడెంట్ అయితే స్పందించే కేటీఆర్...దళిత చిన్నారికి అమానుషంగా చంసేస్తే స్పందించరాఅంటూ, డికె అరుణ ఘాటుగా విమర్శించారు.
సైదాబాద్ చిన్నారి ఘటనలో నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితుడిని అరెస్ట్ చేయకపోవటం సిగ్గుచేటని అన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె, హోంమంత్రి మహమూద్ అలీ కేవలం ఒక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఐటీ మంత్రి కేటీఆర్ పైనా నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నానంటారు కదా, ఆ విషయం మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు.
హీరోలకు ఏదైనా జరిగితే వెంటనే స్పందించే కేటీఆర్, ఒక పేద గిరిజన బాలిక పట్ల ఇంత అమానుషం జరిగితే కనీసం పరామర్శించటానికి రావటం కుదరలేదా? అంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు అరుణ.