ఏపీ సర్కారు తీపికబురు : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (10:45 IST)
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో ప్రమోషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫలితంగా దాదాపుగా వెయ్యిమందికి పైగా పదోన్నతులు లభించనున్నాయి. 
 
ఈ పదోన్నతులను అధికారుల స్థాయిలో తక్కువగా.. ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువగా కల్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మెకానిక్‌లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్‌ సూపర్‌వైజర్లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది. 
 
కాగా, ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఒక్కరికీ ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెలాఖరుకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తు ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments