కోవూరులో కల్వర్టును ఢీకొన్న కారు... మామ - కోడలు మృతి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (10:42 IST)
నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నెల్లూరులోని హరినాథపురానికి చెందిన పార్లపల్లి మహేంద్ర తన కుటుంబంతో కలిసి కుమారుడిని తూర్పు గోదావరి జిల్లా తునిలో ఉన్న హాస్టల్‌లో చేర్పించి తిరుగు పయనమయ్యారు. 
 
ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కల్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న మహేంద్ర తండ్రి పార్లపల్లి సుధాకర్‌రావు(76), భార్య అపర్ణ(35) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
ఈ ప్రమాదంలో మహేంద్రతో పాటు అతడి తల్లి వెంకట సుజాత, కూతురు సిసింద్రి(6) గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments