తాగేవాడిని మార్చలేమని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. తాగేవాడిని తాగొద్దు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని.. కుటుంబాలు దెబ్బతింటాయని చెప్తే.. అన్ని పథకాల కింద సీఎం డబ్బు ఇస్తున్నారు కానీ.. తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదని అంటున్నారు. అలాంటి వారిని ఏం మార్చుతామని జయరాం వ్యాఖ్యానించారు.
ఇంకా తన దురదృష్టం ఏంటంటే తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో వుంది. అర కిలోమీటరు దూరంలో వున్న అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతారు. మద్యం ఏరులై పారుతోందని చెప్పారు.
ఇంకా ఇసుక ట్రాక్టర్లు వదలాలని ఎస్సైని బెదిరించారని వాస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. దందాగిరి చేసేందుకు తాను వీరప్పన్‌లా ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేశానా.. మట్టి తోలుకున్నాక తిరిగొస్తున్న ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై ఆపితే అవి రైతులవి వదిలేయమని చెప్పానని.. తాను ఎక్కడా ఇసుక ట్రాక్టర్లను వదిలేయండి అని చెప్పలేదని వివరణ ఇచ్చారు.