Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కియాను సందర్శించిన ఏపీఐఐసీ ఛైర్మెన్ మెట్టు గోవిందరెడ్డి

Advertiesment
apiic chairman
విజయవాడ , బుధవారం, 8 సెప్టెంబరు 2021 (19:10 IST)
అనంత‌పురం జిల్లా పెనుకొండలోని ఎర్రమంచి వద్దనున్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర ఏపీఐఐసీ ఛైర్మెన్ మెట్టు గోవిందరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కియా ఇండియాలో ప్రెస్ షాప్, బాడీ షాప్, పెయింట్ షాప్ తదితర విభాగాలను ఆయన పరిశీలించారు.
 
అంతకుముందు కియా కంపెనీ ప్రతినిధులు కియా ఇండియాలో కంపెనీ సేల్స్ వివరాలు, ఫ్యాక్టరీ నిర్మాణం, ట్రైనింగ్ సెంటర్ల వివరాలు, కియా కంపెనీ తరఫున ఈ ప్రాంతంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలు, కల్పిస్తున్న సదుపాయాలు, వసతులు తదితర వివరాలను తెలియజేశారు. అనంతరం ఏపీఐఐసీ ఛైర్మెన్ కియా ఇండియా శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ ఛైర్మెన్, ఏపీఐఐసీ ఈడి సుదర్శన్ బాబు కియా, అమ్మవారిపల్లి, గుడిపల్లి పరిశ్రమల యాజమాన్యాలతో పరస్పర అవగాహన సదస్సులో పాల్గొని వివిధ అంశములను చర్చించారు. అలాగే వరల్డ్ క్లాస్ ఆటోమొబైల్ క్లస్టర్ కు సంబంధించి ఎకో సిస్టమ్ అభివృద్ధికి తోడ్పడు అంశములను వారు చర్చించారు.
 
ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ పద్మావతి, కియా ఇండియా ఎండి కుక్ హ్యూన్ షిమ్, కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (సిఏఓ) కబ్ డంగ్ లీ, లీగల్ డిపార్ట్మెంట్ హెడ్ జూడ్ లీ, ప్రిన్సిపల్ అడ్వైజర్ డా. సోమశేఖర్ రెడ్డి, జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్ ) నాగభూషణం, మేనేజర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ‌ ఆఫర్ : గవర్నర్ కోటా అంటే ఆషామాషీనా?