Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు ఆ తరహావే... జూపూడి

ఎన్నికల సమయంలో తమ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ సీబీఐ, ఇన్‌కమ్ టాక్స్ విభాగాలను వాడుకుంటుందని, ఇది వారి ఎన్నికల ఎత్తుగడలో ఒక భాగమని జూపూడి విమర్శించారు.

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (19:33 IST)
ఎన్నికల సమయంలో తమ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ సీబీఐ, ఇన్‌కమ్ టాక్స్ విభాగాలను వాడుకుంటుందని, ఇది వారి ఎన్నికల ఎత్తుగడలో ఒక భాగమని జూపూడి విమర్శించారు. హైదరాబాదులో రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు ఆ తరహావేనన్నారు. ఓటుకు నోటు కేసని అంటున్నారని, అందులో చంద్రబాబు పేరును కూడా వారు ప్రస్తావిస్తున్నారని చెప్పారు. 
 
ఆయనపై ఎటువంటి కేసు ఫైల్ కాలేదని, కోర్టు కూడా అతనిని నిందితునిగా పేర్కొనలేదని తెలిపారు. గతంలో తమిళనాడులో శశికళ, పళనిస్వామి, పన్నీరు సెల్వంలను ఇబ్బంది పెట్టి తమ పబ్బం గడుపుకున్నారన్నారు. కర్ణాటకలో కుమారస్వామిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారన్నారు. తెలంగాణలో జగ్గారెడ్డిపై కూడా పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. 
 
బీజేపీ, టీఆర్ఎస్ మిలాఖత్ అయి వ్యతిరేక పార్టీలపై ఎన్నికల సందర్భంగా దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి చర్యలను నేర ప్రవృత్తిగా భావించవలసి ఉంటుందన్నారు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నవారే ఇలాంటి చర్యలు చేపడతారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇలా చేయడాన్ని తాము విమర్శిస్తున్నామని చెప్పారు.
 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments