ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు తీర్థంలా భావించి తాగిన బీజేపీ కార్యకర్త
అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగి
అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా సెగ్మెంట్ ఎంపీ నిషికాంత్ ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా, కన్హావరా అనే గ్రామానికి వెళ్లారు. ఓ బ్రిడ్జిని నిర్మిస్తానని ప్రకటించిన దూబే ప్రసంగం పూర్తి కాగానే పళ్లెంతో వచ్చిన పవన్ అనే బీజేపీ కార్యకర్త ఎంపీ కాళ్లు కడిగాడు.
అంతటితో ఆగక ఆ నీళ్లను తాగేశాడు. ఆ సమయంలో ఎంపీ అతణ్ని వారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ చర్యను ఆ కార్యకర్త సమర్థించుకున్నాడు. ఆయన తమకు అత్యంత ప్రియతమైన నేత అని, అందుకే అలా చేసినట్టు చెప్పాడు.