Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కూల్‌'గా మత్తు కలిపాడు.. అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు...

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (09:05 IST)
ఓ కామాంధుడు చేతిలో మరో యువతి మోసపోయింది. మాటలతో నమ్మించి మాయచేశాడు. ఆ తర్వాత కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి అత్యాచారం జరిపాడు. ఈ ఘాతుకాన్ని వీడియో తీసి.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక నర్సాపురంలో ఐడియో సెల్యూలార్ షోరూమ్ ఉంది. ఇక్కడ 19 యేళ్ళ యువతి పని చేస్తోంది. ఈమె భీమవరం నివాసి. ఈ క్రమంలో షాపునకు వస్తూపోతుండే రాంబాబు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. 
 
మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. వారిద్దరి మధ్య చనువు పెరగడంతో భీమవరంలోని ఆ యువతి ఇంటికి కూడా వెళ్లసాగాడు. ఓ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఆ యువతికి ఇచ్చాడు. ఆ తర్వాత తన లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసి కొంతకాలంగా బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. దీంతో విసిగిపోయిన యువతి భీమవరం పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది. రాంబాబు సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అతని సొంతూరు ఏనుగువాని లంక అని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments