Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెండ్‌ను చూసేందుకు వెళ్తే వలేసి వంచించిన యువకుడు.. గర్భందాల్చిన టెన్త్ విద్యార్థిని

Advertiesment
ఫ్రెండ్‌ను చూసేందుకు వెళ్తే వలేసి వంచించిన యువకుడు.. గర్భందాల్చిన టెన్త్ విద్యార్థిని
, మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (09:32 IST)
గుంటూరు జిల్లాలో ఓ టెన్త్ విద్యార్థిని గర్భందాల్చింది. తన స్నేహితురాలిని చూసేందుకు వెళ్తే ఓ యువకుడు వలేసి వంచించాడు. ఆ తర్వాత శారీరక సంబంధం పెట్టుకోవడంతో ఆ విద్యార్థిని గర్భందాల్చింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలిక సమీపంలోని జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 15 యేళ్ళ బాలిక టెన్త్ క్లాస్ చదువుతోంది. ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి తరచూ వెళ్లి పుస్తకాలు తెచ్చుకునేది. 
 
అదే అవకాశంగా భావించిన స్నేహితురాలి సోదరుడు గుంజి నరేంద్ర (23) బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి కామవాంఛ తీర్చుకున్నాడు. ఈక్రమంలో ఆ యువతి గర్భందాల్చింది. ఈ విషయం యువకుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతోవారంతా బాలికకు మాయమాటలు చెప్పారు. ఈ విషయం బయట చెప్పొద్దనీ, త్వరలోనే తమ కుమారుడుతో వివాహం జరిపిస్తామని నమ్మించారు. ఆ తర్వాత ఆ బాలికపై నరేంద్ర పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి అయింది. రోజు రోజుకూ తమ కుమార్తెలో మార్పులు వస్తుండటాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్: ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ