Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్నాయుడు జస్ట్ ఎస్కేప్.... ఊపిరి పీల్చుకున్న టీడీపీ శ్రేణులు

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (10:04 IST)
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనుకావడంతో ఈయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 
 
విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి వద్ద డివైడర్‌ను అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. బైక్‌ను తప్పించే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. వేంటనే కారు ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడుతో పాటు కారులో ఉన్న గన్‌మన్ సహా మరికొందరికి కూడా గాయాలయ్యాయి. వీరందరినీ వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. 
 
కాగా, శుక్రవారం గుంటూరులోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అచ్చెన్నాయుడు ప్రమాద వార్త తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యారు. అయితే, ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments