Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాయాలపాలైనప్పుడు ఏం చేయాలి ?

గాయాలపాలైనప్పుడు ఏం చేయాలి ?
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (09:53 IST)
పనులు చేసేటప్పుడు మనకు తెలియకుండానే కాళ్ళకు-చేతులకు ఎక్కడో ఒక చోట దెబ్బలు తగులుతుంటాయి. కాసేపైనాక నొప్పి తెలుస్తుంది.
 
తగిలిన దెబ్బ పెద్దదై నొప్పి అధికంగావుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. దెబ్బ చిన్నదైతే చిట్కాలను అవలంబించండి. 
 
*దెబ్బ తగిలిన వెంటనే అర చెంచా పసుపును పాలలో కలిపి త్రాగండి. దీంతో లో దెబ్బలకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 
* గాయాలపాలైనప్పుడు వాపు లేదా ఎముక విరిగినట్లైతే ఆ ప్రాంతంలో రుద్దకూడదు. దీంతో ఎలాంటి ప్రయోజనంకలగకపోగా దుష్ఫలితాలు అధికంగా ఉంటాయని వైద్యులు సూచించారు. 
 
* దెబ్బ తగిలిన చోట తొలుత బ్యాండ్ ఎయిడ్ వాడండి.
 
* వాపు కలిగిన చోట బాధను తగ్గించడానికి, వాపును తగ్గించడానికి గంటకోసారి ఐస్ ముక్కను పెట్టండి లేదా నీటితో తడిపిన పట్టీలను ఉంచండి. దీంతో నొప్పి, వాపు తగ్గుతాయి. 
 
ప్రస్తుతం ఇక్కడ ఇచ్చిన చిట్కాలు, చిన్న-చిన్న గాయాలు, వాపులకుమాత్రమే. విపరీతమైన గాయాలు అయితే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇవి చేస్తే ఎంత మొండి జలుబైనా మటాషే...