Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతిలో జనసేనాని, ఆవేశంగా పరుగెత్తుకొచ్చి పవన్ చేతుల్లో చెప్పులు పెట్టిన వ్యక్తి, ఎందుకు?

Advertiesment
Janasena
, శుక్రవారం, 30 ఆగస్టు 2019 (17:19 IST)
ఇపుడంతా ఆంధ్ర జనం ఒకటే చర్చ. రైళ్లలో వెళ్తున్నా బస్సుల్లో వెళ్తున్నా అమరావతి రాజధాని ఏమౌతుంది. అక్కడే నిర్మిస్తారా లేదంటే ఎక్కడికో తీసుకెళతారా... అసలు రాజకీయ నాయకులు ఎందుకిలా మాట్లాడుతున్నారు... మంత్రులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రాజధానిపై చెప్పేస్తున్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడరేంటి? నిజంగా అమరావతి అంతేసంగతులా? అమరావతి అదిగో అంటూ చంద్రబాబు చందమామలా చూపించిన రాజధాని నగరం ఇక చరిత్రగా మిగులుతుందా... ఇవన్నీ జనం సందేహాలు. మరి వీటికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.
 
ఇక అసలు విషయానికి వస్తే... రాజధాని అమరావతి కోసం 32 వేల ఎకరాలను ఇచ్చారు ఆ ప్రాంత రైతులు. ఇందుకుగాను వారికి కౌలు రూపేణా చెక్కులు అందుతున్నాయి. చంద్రబాబు హయాంలో ప్రభుత్వానికి-రైతులకు మధ్య ఓ అవగాహన ఒప్పందం జరిగింది.

]ఇదిలావుంటే రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించడం శ్రేయస్కరం కాదంటూ వైసీపీ మంత్రుల్లో కొందరు వ్యాఖ్యానించడంతో అలజడి మొదలైంది. ఆ ప్రాంత రైతుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. తమ సమస్యను పరిష్కరించేలా చూడాలంటూ మొరపెట్టుకున్నారు. 
ఈ నేపధ్యంలో జనసేనాని ఇవాళ అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి రైతులతో మాట్లాడుతున్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ కూచోబోనని అన్నారు. అవసరమయితే ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని చెప్పుకొచ్చారు. ఆయన పర్యటనకు అమరావతి గ్రామాల్లో భారీ స్పందన లభించింది. రైతులు తమ సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 
 
ఈ క్రమంలో ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ వైపుకు ఆవేశంగా పరుగులు తీస్తూ వచ్చాడు. అతడెందుకు అలా వచ్చాడా అని చూసేలోపు సంచీలోనుంచి కొత్త చెప్పుల జత తీసి... అన్నా, పవనన్నా... నీకోసం కొత్త చెప్పులు తెచ్చానన్నా అంటూ పవన్ చేతుల్లో పెట్టాడు. వాటిని పవన్ కల్యాణ్ తీసుకుని కాళ్లకు ధరించి అమరావతిలో పర్యటించారు. ఇక ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గడ్డి తింటున్న సింహం.. వీడియో వైరల్