Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు పొందిన నీ కోసం టీం..

Advertiesment
Pawan Kalyan
, శనివారం, 24 ఆగస్టు 2019 (22:17 IST)
మంచి ఎక్కడున్నా ప్రోత్సహించే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘నీ కోసం’ టీంని అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. కొత్తదనం నిండిన ఈ ప్రేమకథ ట్రైలర్ని  చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ విజయం కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్‌గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. 
 
కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం అని అన్నారు. కాన్సెప్ట్ గురించి తెలుసుకొని ఈ మూవీలో హీరోగా చేస్తున్న అజిత్ రాధారాంని అభినందించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్సాన్స్‌ని రాబట్టుకుంది. కాన్సెప్ట్ బేస్డ్‌గా కనిపిస్తూనే కథ, కథనం పరంగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా కనిపిస్తున్నాయీ ట్రైలర్లో. చూసినవాళ్లంతా 
బాగుందని అభినందిస్తున్నారు.
 
వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న చిత్రం ‘నీ కోసం’ సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది. నవీన్ క్రియేషన్స్ రాజలింగం సమర్పించిన ఈ మూవీలో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన  పాత్రలలో నటిస్తున్నారు.
 
 బ్యానర్: తీర్ధసాయి ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్: అల్లూరమ్మ (భారతి). సినిమాటోగ్రఫీ: శివక్రిష్ణ యెడుల పురమ్ఎడిటింగ్ : తమ్మిరాజు, రచన, దర్శకత్వం : అవినాష్ కోకటి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాల్మీకి జ‌ర్ర జ‌ర్ర సాంగ్ సెన్సేష‌న్... వరుణ్ తేజ్‌కి భారీ హిట్ ఖాయంలా వుంది కదూ...