Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల?

PNR
సోమవారం, 18 మార్చి 2024 (12:17 IST)
కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయంపై కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశంకానుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరపున రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థు పేర్లను ఖరారుచేసి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. 
 
అయితే, తమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బకొట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన సొంత ఇలాకా కడపలోనే దెబ్బకొట్టాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందుకోసం కడప లోక్‌సభ అభ్యర్థిగా జగన్ సోదరి షర్మిలనే సరైన ప్రత్యర్థిగా కాంగ్రెస్ భావిస్తుంది. ఇదే విషయంపై కాంగ్రెస్ పెద్దలు ఆమెతో సంప్రదింపులు జరపడమే కాకుండా, ఖచ్చితంగా లోక్‌సభ ఎన్నికల బరిలో పోటీ చేయాలని ఒత్తిడి చేయడంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 
 
ఈ ప్రచారం నిజమైతే... కడప ఎంపీ స్థానంలో వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రత్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో నిలుస్తారు. ఇదే జరిగే వైఎస్ అవినాశ్ రెడ్డికి కష్టకాలంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. షర్మిల తరపున మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తెతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఆయనను ఓడించాలన్న పట్టుదలతో షర్మిల, సునీతలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments