Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గీతాంజలి మృతిపై వైఎస్ షర్మిల మౌనంగా వున్నారే?: పూనమ్ కౌర్

Advertiesment
poonam kaur

సెల్వి

, బుధవారం, 13 మార్చి 2024 (15:17 IST)
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య ఏపీ రాజకీయాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యకర్తలు చేసిన విపరీతమైన ట్రోలింగ్‌ వల్లే ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో వైకాపా- టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.  
 
ఈ నేపథ్యంలో గీతాంజలి మృతి పట్ల సినీ నటి పూనమ్ కౌర్ సీన్‌లోకి వచ్చింది. ఇంకా తనదైన శైలిలో స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల వెంటనే స్పందించాలని పూనమ్ కోరింది.
 
"స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధానమైన లక్షణం ఇతర స్త్రీలు, పిల్లల పట్ల కరుణ. ప్రస్తుతం గీతాంజలి ఆత్మహత్య ఘటనపై వైఎస్ షర్మిల మౌనం వహించడం తనను చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఘటనపై తెనాలిలోని సామాన్య మహిళలు, బాలికలు బయటకు రావాలి." అని పూనమ్ పిలుపునిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2018లో జరిగిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ హైకోర్టు