Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు వచ్చారు... జాబులు వచ్చాయంటున్న మంత్రి అమరనాథ్ రెడ్డి

బాబు వస్తేనే జాబులు వస్తాయని ఎన్నికల సమయంలో చెప్పినట్లే బాబు వచ్చారు... జాబులు వచ్చాయని పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి అమరనాథ రెడ్డి చెప్పారు. శనివారం ఉయ్యూరులో విలేకరులతో మాట్లాడుతూ... తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలో ఎంతమ

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (21:02 IST)
బాబు వస్తేనే జాబులు వస్తాయని ఎన్నికల సమయంలో చెప్పినట్లే బాబు వచ్చారు... జాబులు వచ్చాయని పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి అమరనాథ రెడ్డి చెప్పారు. శనివారం ఉయ్యూరులో విలేకరులతో మాట్లాడుతూ... తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలో ఎంతమంది పనిచేస్తున్నారు, వారికి సంబంధించిన అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. బాబు వచ్చినా జాబు రాలేదని అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు సీఎం డ్యాష్ బోర్డు చూసి తెలుసుకోవాలని హితవు పలికారు. 
 
గత మూడేళ్లలో జరిగిన భాగస్వామ్య ఒప్పంద సదస్సుల్లో 17 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి, దాదాపు 35 లక్షల మందికి ఉపాధికి సంబంధించిన 1600 ఎంఓయులు చేసుకున్నామన్నారు. చేసుకున్న ఒప్పందాలను గ్రౌండింగ్ చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి తలియజేశారు. కియా, అపోలో టైర్స్ హీరో మోటార్ కార్స్, అశోక్ లేల్యాండ్ తదితర ప్రపంచస్థాయి ఆటోమొబైల్ కంపెనీలతో పాటు ఐటీ రంగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం సహకరించాలి కానీ బురద చల్లే ప్రయత్నాలు చేయరాదని సూచించారు. 
 
కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే వైకాపా, భాజపా, జనసేన పార్టీలు సమావేశానికి రాలేదు. అంటే... రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంపై ఆ పార్టీలకు నిబద్ధత లేదనేది అర్థమైందని మంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments