Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ప్రధానికి అది ఉందో లేదో... మంత్రి కళా వెంకట్రావు ఘాటు వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్రంలోని పెద్దలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కె.ఈ.క్రిష్ణమూర్తి బిజెపి నేతలను రాయలేని భాషలో తిడితే అలాంటి పనే మరికొంతమంది టిడిపి నేతలు చేస్తున్నారు. ప్రాంతమేదైనా... తమకు కలిగిన అన్యాయ

Advertiesment
AP Minister Kala Venkata Rao
, శనివారం, 31 మార్చి 2018 (15:20 IST)
తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్రంలోని పెద్దలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కె.ఈ.క్రిష్ణమూర్తి బిజెపి నేతలను రాయలేని భాషలో తిడితే అలాంటి పనే మరికొంతమంది టిడిపి నేతలు చేస్తున్నారు. ప్రాంతమేదైనా... తమకు కలిగిన అన్యాయాన్ని మీడియా వేదికగా మాట్లాడేస్తున్నారు టిడిపి నేతలు.
 
విద్యుత్ శాఖామంత్రి కళా వెంకట్రావు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఎపికి ప్రత్యేక హోదా చాలా ముఖ్యం. హోదా కావాలని శ్రీవారిని ప్రార్థించా.. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంచి బుద్ధి ఇవ్వమని కూడా కోరుకున్నా. ప్రధానికి బుద్ధి ఉందో లేదో తెలియడం లేదు. ఆర్థికంగా ఇప్పుడే ఇబ్బందులు పడుతున్న ఎపిని మరింత కేంద్ర ప్రభుత్వం వెనుకకు తోసేస్తోందని అన్నారు మంత్రి.
 
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయంటూ ఆవేదనతో వెళ్ళిపోయారు కళా వెంకట్రావు. ఒక సీనియర్ నాయకుడు, ప్రజా ప్రతినిధిగా ఎన్నో యేళ్ళ అనుభవం ఉన్న కళా వెంకట్రావు తిరుమలలో ఆవేదనకు గురవుతూ మీడియాతో మాట్లాడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీపులోకి దూకిన చిరుత.. ఆ వ్యక్తి ఏం చేశాడంటే?