Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ గందరగోళం సృష్టిస్తున్నారు... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడకొట్టి రెండు రాష్ట్రాలకు కొన్ని హామీలు నిండుసభలో అటు అధికారపక్షం ఇటు ప్రతిపక్షం సాక్షిగా విడిపోయిన రాష్టానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో తెలిపారు. కానీ నేడు కేంద్రం ప్రత్యేక హోదా అనేది

Advertiesment
పవన్ కళ్యాణ్ గందరగోళం సృష్టిస్తున్నారు... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
, సోమవారం, 26 మార్చి 2018 (18:43 IST)
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడకొట్టి రెండు రాష్ట్రాలకు కొన్ని హామీలు నిండుసభలో అటు అధికారపక్షం ఇటు ప్రతిపక్షం సాక్షిగా విడిపోయిన రాష్టానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో తెలిపారు. కానీ నేడు కేంద్రం ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం కుదరదని  చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాడి ఆత్మ గౌరవం దెబ్బ తిన్నదని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర ప్రాంత ప్రజలకు  రాజ్యాంగ భద్రతతో కూడిన ఒక హక్కు అని కేంద్రం భావించాలని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, రైతులు పంటలను పండించు కొనుటకు ప్రాజెక్టుల నిర్మాణం, ఒకటేమిటి ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో దూసుకెళుతుందని అన్నారు. 
 
దగా పడిన ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవని లాంటిదని, రాజకీయ అవసరాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని,  స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉత్తరాది వారు విభజించు-పాలించు అనే నేపథ్యంలో దక్షిణాదిని వివక్షకు గురిచేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కేంద్రం గతంలో ప్రత్యేక హోదా ఇవ్వలేమని కొన్ని కారణాలు చెప్పి హోదా వలన వచ్చే ప్రతీ సౌకర్యం మీకు ఒక ప్రత్యేక ప్యాకేజీగా  ఇస్తామని చెప్పి నాలుగేళ్లు కాలయాపనతో నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ప్రజలందరూ గ్రహించి తిరుగుబాటు దిశగా వెళుతున్న ప్రస్తుత తరుణంలో, కొత్తగా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చేందిన కొంతమంది మంత్రులు అవినీతి ఊబిలో ఉన్నారని, తన మార్కు రాజకీయల ద్వారా  ప్రజలకు తెలిపి రాష్ట్రంలో కొంత గందరగోళ పరిస్థితికి కారణమయ్యారు. దీనికి అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌కు బీజేపీ నాయకత్వం ఒక స్క్రిప్ట్ ఇచ్చిందని, బీజేపీ కనుసన్నల్లో ఆయన నడుచుకొంటున్నారు కాబట్టి అందుకే ఆయన ఆవిధంగా మాట్లాడినరని తెలిపారు.
 
ఐతే ఒక నాయకుడిగా ఎదగాలనుకొన్న వారు ఎన్నో రకాలుగా ఎత్తుగడలు వేస్తారు కాబట్టి దాన్ని తెదేపా ఎదుర్కోవాలి. నిన్నటి వరకు మీ మిత్రుడు ఇప్పుడు మీకు శత్రువు అవ్వటం ఏమిటి అని ప్రజలు ఆలోచిస్తున్నారే కానీ పవన్ కల్యాణ్ వెనుక ఎవ్వరున్నారన్న విషయంపై ప్రజలు పెద్దగా స్పందించటం లేదు. ఇది నిజం. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతన్నది రాజకీయ ఉద్యమం మాత్రమే. మా రాజకీయ పార్టీ గొప్ప మీ రాజకీయ పార్టీ గొప్ప అనే దిశగా వెళుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పైన వున్నది ఒక్కటే బాధ్యత. ప్రజలు మీ మాటలను ఎంతవరకు విశ్వసించుచున్నారో తెలుసుకునేందుకు ప్రజా బ్యాలెట్ నిర్వహించలి. ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలుసా... లేక మీ మీ రాజకీయ ఎత్తుగడలను ప్రజలు విశ్వసించుచున్నారా.... లేదా అని తెలుసుకొనుటకు ఖచ్చితంగా ఈ పద్ధతి ద్వారా ప్రయత్నించాలని కేతిరెడ్డి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీతో టీడీపీ రాజీ పడింది.. జేడీ లక్ష్మీ నారాయణ వస్తే ఆహ్వానిస్తాం: పవన్