Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో ఆందోళన చేస్తే ఆడోళ్లు తంతారని ఢిల్లీలో చేశారు : హోం మంత్రి అనిత

వరుణ్
గురువారం, 25 జులై 2024 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే శాంతి భద్రతలు క్షీణించిపోయాయనీ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రాలో ఆందోళన చేస్తే వైకాపా నేతల వేధింపుల కారణంగా నానా అవస్థలు పడిన ఆడోళ్లు తంతారని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని ఆమె అన్నారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, జై జగన్ అనలేదని పల్నాడులో బీసీ నేత చంద్రయ్యను హత్య చేయడం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుతో పాటు వైకాపా నేతలు చేసిన దారుణాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే సగం ఢిల్లీ సరిపోదని ఆమె అన్నారు. 
 
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్... వాటి వివరాలను అందించాలని కోరారు. నిజంగా బాధితులు అంతా వైకాపా వాళ్లు అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ఎందుకు చేయలేదని అడిగారు. వినుకొండలో గంజాయి మత్తులో జరగిన హత్యకు రాజకీయ రంగు పులిమి ఆయన లబ్దిపొందాలని చూస్తున్నారని హోం మంత్రి విర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments