Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు జగన్ గుడ్‌‌న్యూస్ : గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (16:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఓ శుభవార్త చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 4 లక్షల గ్రామ వాలంటర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకోసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
 
దరఖాస్తుదారుని వయసు 18 నుంచి 39 యేళ్లలోపు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తులను జూలై నెలాఖరులోపు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకుంటే, అర్హులైన వారి పేర్లతో కూడిన జాబితాను ఆగస్టు 15వ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది. 
 
ఈ గ్రామ వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను 72 గంటల్లో పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల లబ్ది పొందేలా అనుమతి మంజూరు చేస్తారు. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments