Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి తేజ మృతిపై గవర్నర్ బిశ్వ‌భూష‌న్ సంతాపం

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:28 IST)
తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా అధికారి లాన్స్ నాయక్ బి. సాయి తేజ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. లాన్స్ నాయక్ బి. సాయి తేజ 2013లో జవాన్‌గా ఆర్మీలో చేరారని, ఆయన అత్యుత్తమ పనితీరు ఆధారంగా సిడిఎస్‌కు పిఎస్‌ఓగా నియమితులయ్యారని గవర్నర్ శ్రీ హరిచందన్ తెలిపారు.
 
 
అతి చిన్న వయసులో లాన్స్ నాయక్ సాయి తేజ ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.  మరోవైపు హెలికాప్టర్‌లోని ఇతర రక్షణ సిబ్బందితో పాటు ప్రాణాలు కోల్పోయిన ఒడిశాలోని అంగుల్ జిల్లా కృష్ణచంద్రపూర్ గ్రామానికి చెందిన భారత వైమానిక దళానికి చెందిన జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్ మృతి పట్ల గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం కారణంగా పలువురు ఇతర  అధికారులు అకాల మరణం చెందటంపై ఆవేదన వ్యక్తం చేశార. భారతావని రక్షణ కోసం వీరు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరనీయమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments