Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ కాపునేస్తం... 3.38 లక్షల మందికి రూ.508 కోట్లు జమ

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (14:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ కాపునేస్తం ఒకటి. ఈ పథకం కింద శుక్రవారం మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామంలో జరిగిన బహిరంగ .సభలో సీఎం జగన్ పాల్గొని అర్హులైన లబ్దిదారులకు బటన్ నొక్కి నిధులు జమ చేశారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగింస్తూ, వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని వరుసగా మూడో యేడాది అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన 338792 మంది లబ్ధిదారులకు రూ.508.18 కోట్ల మేరకు ఆర్థిక సాయం చేసినట్టు వెల్లడించార. అంటే ఇప్పటివరకు మూడేళ్లలో ఒక్కో లబ్దిదారుడికి రూ.45 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. మొత్తంమీద కాపు నేస్తం పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1492 కోట్లు ఇచ్చినట్టు సీఎం జగన్ తెలిపారు. 
 
నవరత్నాల ద్వారా కూడా కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నామన్నారు. రూ.16,256 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. నాన్ డీబీటీ ద్వారా కాపులకు మరో రూ.16 వేల కోట్ల మేరకు ప్రయోజనం చేకూర్చనున్నట్టు తెలిపారు. కాపులను ఆదుకోవడంతో తమ ప్రభుత్వం చూపించిన శ్రద్ధ ఇతర ఏ ప్రభుత్వాలు చూపించలేదని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments