Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో జరగని పాపం లేదు.. తిరుపతిని సర్వనాశనం చేశారు.. అశ్వనీదత్

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (14:25 IST)
Ashwani Dutt
వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ విమర్శలు గుప్పించారు. తాను నిర్మించిన ‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని.. తిరుపతిలో జరిగే అన్యాయాలను ఊహించలేమని, ఇప్పుడు అక్కడ జరగని పాపం లేదని అశ్వనీదత్ ఫైర్ అయ్యారు. 
 
స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. 
 
గతంలో తిరుపతిలో ఆగమ శాస్త్రం ప్రకారం వెయ్యికాళ్ల మండపాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలగించారన్నారు. కానీ ఆ విషయంలో నాడు చినజీయర్ స్వామి.. చంద్రబాబును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 
 
ఏపీలో బలవంతపు మత మార్పిడిలు జరుగుతుంటే బాబు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చినజీయర్ ఆ మధ్య జగన్‌ను దైవాంశ సంభూతుడని పొగిడిన మాటలు వినగానే తన కడుపు మండిపోయిందని అశ్వనీదత్  తెలిపారు.
 
సమ్మక్క- సారక్కను చినజీయర్ దేవతలు కాదనడం తనకు బాధ కలిగించిందన్నారు. సమ్మక్క-సారక్క అంటే తెలంగాణ ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments