Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోలను త‌ప్పుదోవ‌ప‌ట్టించారు - నిజంచెప్పిన అశ్వ‌నీద‌త్‌

heroes with cm
, గురువారం, 28 జులై 2022 (16:56 IST)
heroes with cm
సినిమా అనేది బిజినెస్‌. హీరోల‌ను బ‌ట్టి నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, పంపిణీదారులు పెట్టుబ‌డి పెడ‌తారు. అలాంటి హీరోల‌కు సినిమా టికెట్ రేట్ల గురించి థియేట‌ర్ల గురించి అస్స‌లు తెలీదు. సినిమారంగంలో ఏదైనా స‌మ‌స్య వుంటే అది ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌లు, డిస్ట్రిబూట‌ర్లు చ‌ర్చించుకుని ప‌రిష్కరించుకోవాలి. క‌రోనా త‌ర్వాత పూర్తిగా మారిపోయింది. సినిమా టికెట్ల రేట్ల విష‌యంలో హీరోల‌ను ఇన్‌వాల్వ్ చేసి ఇద్ద‌రు సి.ఎం.ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డ‌మే చారిత్రాత్మ‌కి త‌ప్ప‌దంగా ప్రముఖ నిర్మాత అశ్వ‌నీద‌త్ తేల్చిచెప్పారు.

webdunia
C. Ashwaneedath
అస్స‌లు హీరోల‌కు ఈ విష‌యంలో సంబంధ‌మేలేదు. కానీ వారిని ఎవ‌రో త‌ప్పుదోవ‌ప‌ట్టించారు. దాంతో ప్ర‌జ‌లంతా మీ కోట్ల పారితోషికంకోసం టికెట్ రేటు పెంచాలా! అనేంత‌లా ఆలోచ‌న‌లు మారిపోయాయి. ఇలా హీరోలు బ‌య‌ట‌కు రావ‌డం పెద్ద పొర‌పాటు. గ‌తంలో ఎన్‌.టి.ఆర్‌. కాలంలో ఇలాంటి స‌మ‌స్య‌లున్నా ఎవ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లుంటే జోలిపెట్టారు. ఈ విష‌యంలో ఒక‌రిద్ద‌రు హీరోలు దూరంగా వుండ‌డం చాలా మంచిప‌రిణామ‌మం. 
 
ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గడానికి కారణం ఏమని భావిస్తున్నారు ? అనే ప్ర‌శ్న‌కు ఆయ‌న చాలా విష‌యాలు తెలియ‌జేశారు .క‌ర్నుడి చావుకు ల‌క్ష‌కార‌ణాలుగా తిప్పితిప్పి హీరోల‌పైనే అది బాణం ప‌డింది. ఎవ‌రైతే పెద్ద సినిమాలు తీసి టికెట్లు పెంచుకుంటామ‌ని అడిగారో. వారే ఇప్పుడు రూటుమార్చి షూటింగ్‌లు బంద్ అంటున్నారు. ఇది అంద‌రికీ తెలిసిపోయింది. ఒక‌ర‌కంగా ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డానికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు వున్నాయి. అని వివ‌రించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు కథలతో కమిట్ మెంట్