Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమయం వద్దు తమ్ముళ్లూ.. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (11:29 IST)
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును అనుసరించి కొంతకాలం పాటు కొత్త ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయొద్దని భావించానని, అయితే పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలే లక్ష్యంగా, పార్టీ కేడర్ పైన దాడులు చేస్తూ ప్రభుత్వం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. ఆరు నెలల పాటు ప్రభుత్వ పనితీరు చూసి సహేతుకమైన విమర్శలు చేసి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని అనుకున్నా కానీ ప్రభుత్వ తీరు సరిగా లేదు అని సమావేశంలో పేర్కొన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు జరిగితే పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. అంతేకాదు పార్టీ తరపున ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి కార్యకర్తల సమస్యలను పరిష్కారించాలన్నారు. కార్యకర్తల మీద దాడులు జరిగిన సందర్భాల్లో సంఘీభావ యాత్రలు చేయడం ద్వారా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. మరి దేశం నేతలు జగన్ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి రివర్స్ ఎటాక్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments