Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైం జరిగి ఉండదు... జ‌గ‌న్ మోహన్ రెడ్డి

Advertiesment
YS Jagan mohan reddy
, గురువారం, 7 మార్చి 2019 (18:05 IST)
వైసీపీ అధ్య‌క్షుడు వై.ఎస్.జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో సీఎం స్థాయి వ్యక్తి సైబర్ క్రైంకి పాల్పడితే దొంగతనం కాదా అని అడిగాము. చంద్రబాబు చేసిన పనిని వివరించాం.
 
దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైం జరిగి ఉండదు అన్నారు. రెండేళ్ల నుంచి పద్దతి ప్రకారం సైబర్ క్రైం చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ పైన రైడ్ జరిగింది. ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. టీడీపీకి చెందిన సేవ మిత్ర యాప్‌ని ఐటీ గ్రిడ్ తయారుచేసింది.
 
ఆధార్, డీటెయిల్స్ ఎవరిదగ్గర ఉండకూడదు. అవి ఏ రకంగా ఐటీ గ్రిడ్‌లో కనిపిస్తున్నాయి. ఆధార్ వివరాలు టీడీపీ సేవ మిత్ర యాప్‌లో ప్రైవేట్ కంపెనీలో కనపడటం నేరం కాదా అని ప్ర‌శ్నించారు. ఓటర్ లిస్ట్ మాస్టర్ కాపీ ఏవిధంగా ఐటీ గ్రిడ్, టీడీపీ సేవ మిత్ర యాప్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రజల బాంక్ ఎకౌంట్ వివరాలు ఇట్ గ్రిడ్, టీడీపీ సేవ మిత్ర యాప్‌లో ఉన్నాయి. రేపు మీ అంతట మీరే ఏమి చేసినా, ప్రజలు మోసపోరా... నాశనం అయిపోరా అన్నారు.
 
సర్వేల పేరుతో చంద్రబాబు డేటాని సేవ మిత్రా యాప్‌లో ఇంస్టాల్ చేశారు. ఓటరు ఎవరికి ఓటు వేస్తున్నారూ అని గ్రామాలకు వెళ్లి సర్వే చేస్తున్నారు. టీడీపీకి ఓటు వేయనివారి ఓట్లు తొలగిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి రెండు ఓట్లు నమోదు చేస్తున్నారు.
 
గత ఎన్నికల్లో మాకు టీడీపీకి ఓట్ల తేడా ఒక్క శాతం. ఎన్నికల సంఘం చేసే విచారణకు మేము సహకరిస్తుంటే... సీఎం పోలీసులను ఉపయోగించి ఫార్మ్ 7 అప్లై చేసిన వారిని హరాస్ చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు చేస్తుంది తప్పు... ఫార్మ్ 7 అప్లై చేయడం తప్పు. ఆధార్ డేటా, బ్యాంక్, ఓటరు ఐడి డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటే అది నేరం. ప్రైవేట్ వ్యక్తులకు డేటా చోరీ చేసి ఇచ్చిన వ్యక్తి సీఎంగా ఉండటానికి అర్హుడేనా? చంద్రబాబు, ఆయన కొడుకుని జైల్లో పెట్టాలి. నేరం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. చేసేది తప్పు.. దానిని ఆంధ్ర, తెలంగాణ గొడవ కింద తప్పు దోవ పట్టిస్తున్నారు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడు రైలు కింద పడిపోతే.. ప్రేయసి సొమ్మసిల్లి పడిపోయింది..?