Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (20:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,224 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,58,951కు చేరుకుంది. ఇందులో 43,983 యాక్టివ్ కేసులు ఉండగా, 7,58,951 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 32 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 6256కి చేరుకుంది.
 
కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదు మంది చొప్పున, గుంటూరు 4, కడప 4, అనంతపురం 3, తూర్పుగోదావరి 3, చిత్తూరు 2, పశ్చిమగోదావరి 2, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 66,30,728 నమూనాలను పరీక్షించారు.
 
ఇక జిల్లాల పరంగా కేసుల విషయానికి వచ్చేసరికి అనంతపుర్ జిల్లాలో 209, చిత్తూరులో 293, ఈస్ట్ గోదావరిలో 547, గుంటూరులో 379, కడపలో 190, కృష్ణలో 86, కర్నూలు 136, నెల్లూరులో 166, ప్రకాశం 270, శ్రీకాకుళంలో 133, విశాఖపట్నంలో 135, విజయనగరంలో 191, వెస్ట్ గోదావరిలో 489 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments