Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జడ్జిలను తిట్టినవారిపై ఎఫ్ఐఆర్‌లు : సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం

Advertiesment
జడ్జిలను తిట్టినవారిపై ఎఫ్ఐఆర్‌లు : సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
, సోమవారం, 12 అక్టోబరు 2020 (15:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తలంటింది. అధికార వైకాపా నేతలు ఇటీవలి కాలంలో న్యాయవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి వారు కూడా న్యాయవస్థతో పాటు.. హైకోర్టు వెలువరించే తీర్పులను, ఆ తీర్పులు ఇచ్చే జడ్జిలను ఉద్దేశించి అవాంఛనీయ రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
వీటిని తీవ్రంగా హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ, అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాకుండా న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన కేసును తాజాగా సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కూడా జడ్జిలపై వ్యాఖ్యలు చేసినవారిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలుజారీచేసింది. 
 
ముఖ్యంగా, ఈ దర్యాప్తులో సీబీఐకి సహకరించాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థలపైనా, న్యాయమూర్తులపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెరిగిపోతుండడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. 
 
ఇటీవల కొన్ని ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో జడ్జిల పట్ల అవమానకర రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన వ్యాఖ్యలపైనా న్యాయస్థానం దృష్టి సారించింది. స్పీకర్ న్యాయవ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారించక తప్పదని హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తి పేషెంట్‌కు ట్రీట్మెంట్ ఇస్తే..?