Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భద్రత నడుమ అలహాబాద్ హైకోర్టుకు హత్రాస్ హత్రాస్ మృతురాలి కుటుంబ సభ్యులు

Advertiesment
భద్రత నడుమ అలహాబాద్ హైకోర్టుకు హత్రాస్ హత్రాస్ మృతురాలి కుటుంబ సభ్యులు
, సోమవారం, 12 అక్టోబరు 2020 (10:32 IST)
హత్రాస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కట్టుదిట్టమైన భద్రత నడుమ అలహాబాద్ హైకోర్టుకు తరలించారు. వీరిని సోమవారం లక్నోలోని హైకోర్టు బెంచ్‌ ఎదుట హాజరుపరచనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ వినీత్ జైశ్వాల్ సమక్షంలో భారీ భద్రత మధ్య వారు కోర్టుకు పయనమయ్యారు. 
 
అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ కేసును సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టిన నేపథ్యంలో బాధిత యువతి తల్లిదండ్రులను పోలీసులు కోర్టుకు తరలించారు. బాధిత కుటుంబం వెంట సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అంజలి గంగ్వార్ కూడా ఉన్నారు. 
 
కాగా, 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుకను తెగ్గోసినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
బాధితురాలు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. అయితే, ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే అర్థరాత్రి వేళ దహనం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, మృతురాలి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టరుతో సహా జిల్లా ఎస్పీ, ఉన్నత వర్గానికి చెందిన కొందరు బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులను తమ ఎదుట హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు, జిల్లా అధికారులు కలిసి వారిని లక్నోకు తీసుకెళ్ళారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత విజయం.. భారీ మెజార్టీతో అదుర్స్