Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (19:56 IST)
Bus Accident
బాపట్లలో పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా కూచిపూడి-పెదపూడి మధ్య మంగళవారంనాడు పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. 
 
అమృతలూరు మండలం కూచిపూడిలోని స్కూల్‌లో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్న అనంతరం తిరిగి ఇంటికి బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు అంటున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతలో రోడ్డు వెంట వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్కూల్ బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీశాడు. ప్రమాదం జరిగిన బస్సులో 35 మంది విద్యార్థులున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments