Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నవరం దేవస్థానంలో కొత్త నిబంధన - ప్లాస్టిక్ నిషేధం

Advertiesment
annnavaram temple
, సోమవారం, 14 ఆగస్టు 2023 (08:58 IST)
పర్యావరణ పరిరక్షణ కోసం కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం పాలకమండలి కొత్త నిబంధనలు అమలు చేయనుంది. మంగళవారం నుంచి కొండపై ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో అజాద్ తెలిపారు. అక్కడి దుకాణాల్లో కేవలం గాలు సీసాలు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారని చెప్పారు. 750 ఎంఎల్ గాజు సీజాల్లో నీటికి రూ.60, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీటికి రూ.40 చొప్పున ధరను ఖరారు చేశారు. 
 
గాజు సీసా తిరిగిచ్చేవారు రూ.40 వెనక్కి ఇవ్వాలని వెల్లడించారు. మూత తెరవని కూల్ డ్రింక్స్‌ను (మంచినీళ్ల మినహా) మాత్రమే కొండపైకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రజలు నిబంధనలు పాటించేలా తనిఖీలు కూడా చేస్తారని పేర్కొన్నారు. కొండపై జరిగే వివాహాలకూ ఈ నిబంధన వర్తిస్తాయని స్పష్టం చేసింది. వీటిని అతిక్రమించిన వారిపై రూ.500 జరిపానా విధిస్తామని, ఆలయ సిబ్బంది అంతా ఈ రూల్స్ పాటించాలని ఈవో ఆదేసాలు జారీ చేశారు. 
 
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకిడి మృతి 
 
ఏపీలోని నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో విషాదకర ఘటన జరిగింది. స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందింది. ఆదివారం స్నేహితులతో క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. చేతికొచ్చిన కొడుకు కోల్పోయిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 
 
నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని సంజీవ నగర్ కాలనీకి చెందిన మహేంద్ర (22) ఆదివారం మధ్యాహ్నం తన స్నేహితులో కలిసి ఆడుతూ ఆకస్మాత్తుగా మరణించాడు. కాలనీ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అతడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ యువకుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. చేతికందివచ్చిన కొడుకు హఠాత్తుగా దూరమవుడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతే లేకుండా పోయింది. 
 
బోనులో చిరుత.. ఎట్టకేలకు బంధించిన తితిదే అధికారులు  
 
తిరుమల నడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. చిరుత పట్టుకునేందుకు సిబ్బంది ఘటనా స్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఫలితంగా తిరుమల - అలిపిరి కాలినడక మార్గంలో ఏదో మైలు రాయి వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది.
 
కాగా, ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కాలి నడక మార్గంలో తిరుమలకు వెళుతుండగా అకస్మాత్తుగా చిరుత బాలిక దాడి చేసింది. తల్లిదండ్రుల కంటే ముందు వెళుతున్న బాలికపై రాత్రివేళ దాడి చేసిన చిరుత ఆ తర్వాత పొదల్లోకి చిన్నారిని ఈడ్చుకెళ్లి చంపి తినేసింది. 
 
మరుసటి రోజు ఉదయం బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగడంతో తిరుమల అదికారుల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెట్ల మార్గంలో చిన్నారులను అనుమతించరాదని వంద మంది భక్తుల చొప్పున ఓ బృందంగా నడక మార్గంలో పంపించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బేతంచెర్లలో విషాదం... క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకిడి మృతి