Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

ఠాగూర్
ఆదివారం, 6 జులై 2025 (11:18 IST)
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు కొమరోలు మండలం అక్కపల్లె శివార్లలో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.
 
స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న యువతీ యువకుడి మృతదేహాలను గుర్తించారు. మృతులను నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన వారికి గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
మనిషి దంతాలతో వింత చేప? 
 
ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలో ఓ వింత చేప కనిపించింది. ఈ వింత చేప ప్రత్యేకత ఏంటే... ఈ చేపకు మనిషి దంతాలు ఉండటమే. దీంతో ఈ చేపను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. చేప నోరు తెరిసి చూస్తే.. మనిషి పళ్ల వరుస కనిపించడంతో ఆ చేపను చూసినవారంతా అవాక్కవుతున్నారు. ఈ చేప ఇపుడు స్థానికంగా చర్చనీయాంమశంగా మారింది. 
 
వివరాలను పరిశీలిస్తే, మొగల్తూరు మండలం సుబ్రహ్మణ్యేశ్వరం రోడ్డులోని ఓ చేపల చెరువులో ఈ రూప్ చంద్ అనే చేప కనిపించింది. ఈ చేప నోట్లోని పళ్ల వరుస అచ్చం మనిషి కింద దవడను పోలి ఉండటం విశేషం. ఇది చూడటానికి వింతగా ఉన్నా.. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, చేపలను పట్టే రైతులు ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా... ఇది చేతివేళ్లను బలంగా కొరికేస్తుందని చెబుతున్నారు. 
 
ఈ చేపపై నరసాపురం మత్స్యకారుల అసోసియేషన్ డీన్ నీరజ మాట్లాడుతూ, రూప్ చంద్ చేపలు ప్రమాదకరమైన పిరాన్హా జాతికి చెందిన చేపలని చెప్పారు. ఇవి పూర్తిస్థాయి మాంసాహారులను ఆమె తెలిపారు. చెరువుల్లో నీటిని సాధారణంగా రెండు నుంచి మూడు కిలోల బరువు పెరిగే వరకు పెంచుతారని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో పెంపకందారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments