Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ బోర్డు సభ్యులుగా వేనాటి... సుగవాసి

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు సభ్యులుగా వేనాటి రామచంద్ర రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి తితిదే బోర్డు సభ్యులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. 
 
అలాగే, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా బోర్డు సభ్యురాలి పదవిని సున్నితంగా తిరస్కరించింది. దీంతో వీరిద్దరి సభ్యత్వాలను దేవాదాయ శాఖ రద్దు చేసింది. అదేసమయంలో ఈ ఇద్దరి పోస్టుల స్థానంలో కొత్తవారిని నియమించింది. 
 
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రా రెడ్డి, కడప జిల్లా రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్‌బాబులను నియమించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఫ్లోర్ లీడర్‌గావున్న వేనాటి రామచంద్రా రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కడంపై సూళ్లూరుపేట టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments