Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కా చెల్లెళ్లకు స్మార్ట్ ఫోన్లు : చంద్రన్న ఎన్నికల తాయిలం.. జర్నలిస్టులకు కూడా...

Advertiesment
అక్కా చెల్లెళ్లకు స్మార్ట్ ఫోన్లు : చంద్రన్న ఎన్నికల తాయిలం.. జర్నలిస్టులకు కూడా...
, బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:35 IST)
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రజలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే డ్వాక్రా గ్రూపులోని ప్రతి మహిళకు రూ.10 వేల చొప్పున ఉచితంగా ఇచ్చారు. అలాగే, వృద్ధాప్య, వితంతు, వికలాంగు పింఛన్లను రెట్టింపు చేశారు. తాజాగా డ్వాక్రా గ్రూపులకు ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని నిర్ణయించారు. 
 
ఈ నిర్ణయానికి ఏపీ మంత్రివర్గం బుధవారం ఆమోదముద్రవేసింది. అలాగే, పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుతోపాటు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుతోపాటు మూడేళ్ల పాటు కనెక్టివిటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయింపు, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయించారు. 
 
అలాగే ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. చదరవు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. అదేవిధంగా రైతు రుణమాఫీ చెక్కులను త్వరితగతిన చెల్లించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటీ కంపెనీలపై ట్రంప్ ఒత్తిడి.. భారతీయులకు షాక్... స్థానికులకే పెద్దపీట..