ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 : జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం...

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (11:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదైంది. ఈ మేరకు అర్థరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్ ఎన్నికల సంఘం అప్‌డేట్ చేసింది. 
 
ఇంట్లో భర్త శవం ఉన్నా... బాధను దిగమింగుకుని వెళ్లి ఓటు వేసిన భార్య 
 
ప్రజాస్వామ్య దేశంలో పలువురు ఓటు హక్కును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఓటు వేసి తీరుతారు. అందరికీ స్ఫూర్తిదాకయంగా నిలుస్తారు. అలా ఓ మహిళ నిలిచారు. అనారోగ్యంతో చనిపోయిన భర్త శవాన్ని ఇంట్లో ఉన్నప్పటికీ బాధ్యత మరవకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా కారంచేడులో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన గర్నెపూడి చిట్టెమ్మ భర్త సింగయ్య (62) పోలింగ్ రోజైన మే 13 సోమవారం తేదీన అనారోగ్యంతో చనిపోయాడు. 
 
అయినప్పటికీ భర్త శవం ఇంట్లో ఉన్నప్పటికీ ఆమె పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. 178 పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువను ఇతరులకు చాటిచెప్పారు. కాగా, గ్రామంలో చిట్టెమ్మ వీఏవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఓటుపై అవగాహన ఉన్న ఆమె ఎంతో బాధలోనూ ఓటు వేయడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. దీంతో గ్రామస్థులంతా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments