Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని ఆ రెండు గ్రామాల్లో 100 శాతం పోలింగ్..!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (10:24 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఈ దశలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. అయితే, తెలంగాణాలోని రెండు గ్రామాల్లో ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. అక్కడి ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయిలో వంద శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టోరల్ ఆఫీసర్ శక్రు నాయక్, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్ అధికారి రాజ్‌కుమార్‌ను కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రత్యేకంగా అభినందించారు. 
 
అలాగే, మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన 62ఏ అదనపు పోలింగ్ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉన్నారు. దంతో సంగాయిపేట తండా వాసులను మెదక్ జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదిలావుంటే, తెలంగాణాలో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. గ్రామీణ తెలంగాణాలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతానికి పైగా నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments