Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గన్నవరంలో గరంగరం : టీడీపీ వర్సెస్ వైకాపా అభ్యర్థుల వర్గీయుల మధ్య తోపులాట

Advertiesment
vote

ఠాగూర్

, సోమవారం, 13 మే 2024 (14:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురు ముదురు సంఘటనలతో పాటు ఉద్రిక్తంగా ఘటనలు చోటుచేసుకున్నాయి. నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉన్న సమయంలోనే ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి వెనక్కి పంపారు. 
 
అదేవిధంగా గుంటూరు జిల్లా పెదపరిమిలోఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా నేత సందీప్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదనపు ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 
 
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలందరూ కదిలివచ్చి ఓటేయండి : సీఎం జగన్ ట్వీట్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఈ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 
ఫలితంగా ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మూడో ఎన్నికలు ఇవి. గత రెండు ఎన్నికలతో పోల్చుకుంటే ఈ దఫా మాత్రం సుదూర ప్రాంతాల నుంచి సైతం ఏపీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఓ ట్వీట్ చేశారు. 
 
అన్ని వర్గాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశఆరు. "నా అవ్వతాతలందరూ, నా అక్కచెల్లెమ్మలందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలందరూ.. అందరూ కదిలి రండి. తప్పకుండా ఓటు వేయండి" అంటూ తన సందేశం ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు ఢీకొని అంగన్‌వాడీ కార్యకర్త, కుమారుడి మృతి